Home  »  Bollywood News  »  Shah Rukh Khan: సినిమా వేలంపాటలో పాల్గొన్న షారుఖ్..దటీజ్ సినిమా

Updated : Jul 28, 2026

ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కింగ్ ఖాన్ 'షారుక్ ఖాన్'(Shah Rukh Khan) కి ఉన్న చరిష్మా గురించి చెప్పకోవడానికి రోజులు చాలవు. లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఇలా అన్ని జోనర్స్ లో మూడు దశాబ్దాలపై నుంచి చేస్తూ జెన్ జీ హీరోలు సైతం సలాం కొట్టే విధంగా దూసుకుపోతున్నాడు.  ప్రస్తుతం 'కింగ్' మూవీతో బిజీగా ఉన్న షారుక్ కేవలం తెరపై కనిపించే సూపర్‌స్టార్ మాత్రమే కాదు, సినిమా చరిత్రని , కళని అమితంగా ప్రేమించే గొప్ప కళాభిమాని. మన సినీ వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన షారుఖ్ లో  ఎంతగా ఉందో తెలియజెప్పే ఒక ఆసక్తికరమైన నిజం ఇటీవల వెలుగులోకి వచ్చింది. 

భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన చారిత్రాత్మక చిత్రం 'మొఘల్-ఎ-ఆజమ్'. 1960 లో కె. ఆసిఫ్ దర్శకత్వంలో దిలీప్ కుమార్, మధుబాల, పృథ్వీరాజ్ కపూర్ కీ రోల్స్ లో తెరకెక్కింది. ఈ క్లాసిక్ మాస్టర్‌పీస్ చిత్రానికి సంబంధించిన రెండు అరుదైన ఒరిజినల్ పోస్టర్లని 'గ్రేటెస్ట్ ఇండియన్ షో ఆన్ ఎర్త్' వేలాన్ని నిర్వహించింది. ఈ వేలంలో 'మొఘల్-ఎ-ఆజమ్ పోస్టర్స్ ని   షారుఖ్  6,84,000 రూపాయలకి  దక్కించుకున్నాడు. వేలంలో స్వయంగా పాల్గొన్న షారుక్, పోటీపడి మరీ బిడ్డింగ్ గెలుచుకోవడం విశేషం. కేవలం 'మొఘల్-ఎ-ఆజమ్' పోస్టర్లు మాత్రమే కాకుండా, భారతీయ సినిమా రంగానికి చెందిన దాదాపు 12 నుండి 13 అరుదైన  మెమొరీబియల్  వస్తువులని కూడా కొనుగోలు చేశాడు. మొత్తం 220 లాట్‌లుగా సాగిన ఈ భారీ వేలంలో 163 లాట్‌లు అమ్ముడవగా, మొత్తం 55.60 లక్షల విలువైన వ్యాపారం జరిగింది. ఇందులో షారుఖ్ ఖాన్ కొనుగోలు చేసిన వస్తువులు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.

Also read: ఈ రోజు ధనుష్ పుట్టిన రోజు.. రాజకీయ ప్రకటన వివరాలు ఇవే!

ఈ వేలంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా పాల్గొనడం మరో విశేషం. ఆయన తండ్రి సురీందర్ కపూర్ 'మొఘల్-ఎ-ఆజమ్' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రత్యేక అనుబంధంతో, అనిల్ కపూర్ కూడా ఈ వేలంలో కొన్ని అరుదైన వస్తువుల కోసం బిడ్డింగ్ వేశారు. ఇదే వేలంలో రాజ్ కపూర్, నర్గీస్ నటించిన 'శ్రీ 420' పెయింటింగ్ అత్యధికంగా 7.5 లక్షలకు అమ్ముడవగా, 'మదర్ ఇండియా' చిత్రానికి చెందిన ఆరు పేజీల భారీ పోస్టర్  2.52 లక్షలకు అమ్ముడైంది. ఆర్కైవిస్ట్ ఎస్.ఎం.ఎం. ఆసాజా మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తూ మన చలనచిత్ర పరిశ్రమలో పాత సినిమాల జ్ఞాపకాలను, పోస్టర్లను, స్క్రిప్ట్‌లను భద్రపరిచే సంస్కృతి చాలా తక్కువగా ఉందన్నారు. అయితే షారుఖ్ ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్, ఫరా ఖాన్ వంటి కొద్దిమంది మాత్రమే సినీ చరిత్రను కాపాడటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు. పాతకాలపు జ్ఞాపకాలను, కళాత్మక పోస్టర్లను సేకరించి భద్రపరచడంలో షారుఖ్  చూపుతున్న ఈ నిబద్ధత, ఆయనకు సినిమాపై ఉన్న అపరిమితమైన ప్రేమకు అద్దం పడుతోంది. అందుకే ఆయన కేవలం రికార్డుల బాద్‌షా మాత్రమే కాదు, నిజమైన సినీ ప్రేమికుడు అని మరోసారి రుజువైంది.

Shah Rukh Khan, King






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.